.

The period between Nannaya and Tikkana is generally called the age of Shaiva Poets, and Palkuriki somanatha is the foremost among them. He utilised his life and works solely for the propogation of the shaiva religion founded by basaveshwara.

Monday, December 21, 2009

Basava Puranam of Palkuriki somanatha

Story Of Rudra Pasupati in Basava Puranam

రుద్రపశుపతి శివుడు విషము మ్రింగెనని’ విని యుల్కిపడి వీపు విఱగి హా చెడితినని నేలబడి పొర్లి *" యక్కటా ! నిన్ను వెఱ్ఱి జేసిరి గాక ! విశ్వేశ ! యెట్టి వెఱ్ఱి వారై నను విషము ద్రావుదురె ? * అని పరితపించు రీతి పాల్కురికి సోమనాధుడు హ్రుదయము ద్రవించునట్లు తనివి తీర వర్ణించెను.


తల్లి యున్న విషము ద్రావ నేలిచ్చు...

http://cid-ebc2ab90be8df406.office.live.com/browse.aspx/.Public/palkuriki


గరళంబు మ్రింగె శ్రీకఱకంఠు ( డనిన


నారుద్రపశుపతి యాలించి "భర్గు


డారగించుట నిక్కమా విషం " ? బనుడు


"ననుమానమా ! త్రావె హరుడు విషంబు


బనుగొన నటమీ( దిపను లెఱుంగ" మన


విని యుల్కిపడి వీపు విఱిగి " హా ! చెడితి"


నని నేల బడి పొర్లి " యక్కటా ! నిన్ను


వెఱ్ఱి జేసిరి గాక ! విశ్వేశ ! యెట్టి


వెఱ్ఱి వారై నను విషము ద్రావుదురె ?


బ్రదుకుదురె ? విషమ్ము పాలైన వార ?


లిది యెట్టు విన వచ్చు ; నేమి సేయుదును ?


నిక్క మెవ్విధమునె నిన్నెకా కెఱుంగ;


ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య ?


నా కొఱకైన బినాకి ! యివ్విషము


చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను;


గటకటా ! మేన సగంబున నుండి


యెట వోయితవ్వ ! నీ వెఱు గవే గౌరి !


ప్రమధగణములార ! పరమాప్తులార!


సమసిన వెండి మీ శక్యమే కావ ?


శత రుద్రులార ! యసంఖ్యాతులార !


క్షితిధరకన్యకాపతి గావరయ్య !


వీరభద్రయ్యరో ! విషము బ్రాణేశు (


డారగించె ని కెట్టు లవునో కదయ్య!


యో పురాతనులార ! యొడయుండు బ్రదుక


నోపు నొకో ! విషం బొగి నారగించె ( ;


జావు దప్పింపరే సద్గురు నాధు ;


దీవెన లీయరే కావరే శివుని ;


దల్లిలేని ప్రజల దలతురే యొరులు?


తల్లి యున్న విషము ద్రావ నేలిచ్చు !


పరమేశు డీ బారి బ్రదికె నేనియును


మరణంబు లేదువో మఱి యెన్నటికిని."


నని ప్రలాపించుచు బనవుచు నొండు


వినజాల బ్రాణము ల్విడుతు నే ననుచు


దడయక ఘన జలాంతరమున నుఱుక


బడకుండ నారుద్ర పశుపతి బట్టి


పార్వతీ సహితుడై ప్రమధరుద్రాది


సర్వ సురాసుర సంఘంబు గొలువ


హరుడు ప్రత్యక్ష మై " యడుగుము నీకు


వరమిత్తు నెయ్యది వాంఛితం " బనుడు


గడు సంభ్రమంబున మృడు పదాబ్జముల


బడి రుద్రపశుపతి భట్టారకుండు


" ఏమియు నే నొల్ల ; నీ విష సేవ


నేమేమి వుట్టునో యే వినజాల;


గ్రక్కున నుమియవే కాలకూటంబు


నిక్కంబు నా కెక్కనీ యీవి." యనిన


దశనకాంతులు దశదిశల బర్వంగ


బశుపతి యారుద్రపశుపతి కనియె ;


"నిట లోకములలోన నెన్ననే కాక


యట మ్రింగ నుమియంగ నది యెంత పెద్ద?


యణుమాత్ర నా కంఠమందు జిక్కినది ;


గణుతింప నున్నదే కాలకూటంబు


ఇంత సంతాపింప నేల నీ ? " కనుచు


వింతన వ్వొలయంగ సంతరించుడును-
"నమ్మంగ జాల బినాకి ! యివ్విషము


గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను


బెద్దయు బుట్టునో పిమ్మటి వార్త


దద్దయు విన నోప దా మున్న చత్తు


సమయని మ్మొండేని జావనీవేని


యుమియు మివ్విషమొండె నొండు సెప్పకుము


తక్కిన మాటలు దనకింప" వనుచు


నిక్కంబు తెగువమై నిష్టించి పలుక ;


"నుమియ కుండిన జచ్చునో ముగ్ఢ " యనుచు


నుమబోటి యాత్మలో నుత్తలపడగ


"నుమిసిన గొని కాల్చునో తమ్ము" ననుచు


గమలాక్ష ముఖ్యులు గడగడ వడక (


బ్రమధు లాతని ముగ్ధ భక్తికి మెచ్చి


యమిత మహోత్సవులై చూచుచుండ


నొక్కింత నవ్వుచు నుడురాజధరుడు


గ్రక్కున లేనెత్తి కౌగిట జేర్చి,


"ప్రమధుల యాన నీ పాదంబులాన


సమయ నివ్విషమున సత్య మిట్లనిన


నమ్మవే వలపలి నాతొడ యెక్కి


నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు"


నని యూరుపీఠంబునందు ధరించె


మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు


నదిగాక కుత్తుక హాలాహలంబు


కదలినంతటనే చచ్చెద గాక ! యనుచు


దనకరవాలు ఱొమ్మున దూసి మోపి


కొని కుత్తుకయ చూచుచును ఱెప్ప లిడక


పశుపతి తొడమీద బాయక రుద్ర


పశుపతి నేడును బాయకున్నాడు.

No comments:

Post a Comment